పుట్టిన రోజు నాడు చేత్తో పెయింటింగ్స్ వేసుకుంటున్న సల్మాన్ ఖాన్
on Dec 27, 2023
హిందీ చిత్ర సీమలో ముప్పయ్యేళ్ల నుంచి తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు నెంబర్ వన్ హీరో గా వెలుగొందుతున్న హీరో సల్మాన్ ఖాన్. అభిమానులందరు ముద్దుగా సల్లు భాయ్ అని పిలుచుకునే సల్మాన్ కి ఇండియా వైడ్ గా అభిమానులున్నారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. సల్మాన్ తాజాగా ఒక అధ్బుతాన్ని సృష్టించాడు.
సల్మాన్ కేవలం తన చేతి వేళ్ళతో ఎన్నో రకాల పెయింటింగ్స్ ని వేసాడు. అవి అలాంటి ఇలాంటి పెయింటింగ్స్ కాదు వాటిని చూస్తే వాటిల్లో జీవకళ కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అయన వేసిన ప్రతి పెయింట్ కూడా ఒక దృశ్య కావ్యం అని చెప్పవచ్చు. పన్వేల్ లో ని తన ఇంట్లో ఉన్న సల్మాన్ ఒక ప్రొఫిషినల్ ఆర్టిస్ట్ లా చాలా ఏకాగ్రతతో పెయింటింగ్ వేసే పనిలో నిమగ్నమయ్యి ఉన్నారు. సోషల్ మీడియాలో వీటిని చూసిన అందరు సల్మాన్ కున్న సృజనాత్మకతని మెచ్చుకుంటున్నారు.
సల్మాన్ గతంలో కూడా ఒకసారి ఇలాగే చేతి వేళ్ళతో పెయింటింగ్స్ వేసి తన చెల్లెలు అర్పితా ఖాన్ కి బావ ఆయుష్ శర్మకి ఒక అందమైన కళాకృతిని గిఫ్ట్ గా ఇచ్చాడు. అలాగే సల్మాన్ వేసిన పెయింట్స్ కూడా కోట్లలో అమ్ముడయిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు
Also Read